Telangana: తెలుగు పుస్తకం ముందు మాట పేజీ చింపి అతికించే పనిలో ఉపాద్యాయులు !

-

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బోధన పక్కకి పెట్టి తెలుగు పుస్తకం ముందు మాట పేజీ చింపి అతికించే పనిలో ఉపాద్యాయులు ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తోందని BJP, BRS విమర్శిస్తున్నాయి. టీచర్లు పాఠాలు చెప్పడం మానేసి పుస్తకాల్లో ముందు పేజీలు అతికిస్తున్నారంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.

పుస్తకాల ముందుమాటలో మాజీ CM, మాజీ మంత్రుల పేర్లు ఉండడంతో పంపిణీ చేసిన పుస్తకాలను విద్యాశాఖ వెనక్కి తీసుకుంది. ఇప్పుడు ఆ పేజీని చించి ముందుమాట కనిపించకుండా QR కోడ్ ఉన్న పేజీపై పేస్ట్ చేస్తున్నారు. కాగా పుస్తకాల ముందుమాటలో మాజీ CM, మాజీ మంత్రుల పేర్లు ఉండడంతో కొంత మంది అధికారులపై వేటు కూడా వేసింది రేవంత్‌ సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Latest news