అక్రమ రవాణా చేస్తే వారిపై పిడి యాక్ట్ : మంత్రి కొల్లు రవీంద్ర

-

ఇసుక విధానంలో మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళుతున్నాం. గత ప్రభుత్వ తప్పుల వల్ల NGT పెనాల్టీలు వేసింది అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 35 లక్షల టన్నులు పారదర్శకంగా అప్పట్లో మేం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఇచ్చాం. ఆన్ లైన్ దళారులు, మాఫియా గత ప్రభుత్వం లో దోచుకుంది. ఎడ్లబండ్ల మీద తీసుకెళ్ళే అవకాశం గతంలో ఉండేది… ఇప్పుడు ఆ అవకాశం ఇచ్చాం. సీనరేజీ, డీఎంఎఫ్ లాంటివి అన్నీ ఎత్తేశాం. ఇసుక ఎవరికి వారు సొంతంగా లోడ్ చేసుకోవచ్చు.. స్వంత అవసరాలకే వాడుకోవాలి. బోట్ మేన్ సొసైటీలకు కూడా భూముల విషయంలో అవకాశం ఇస్తాం.

రిజిస్ట్రేషను ఆన్ లైన్ లో చేసుకోవడం వ్యక్తి వివరాల కోసం మాత్రమే. నిర్మాణ రంగంలో ఎన్నో అవకాశాలు ఉంటాయి.. దానిపై దృష్టి పెట్టాం. ఎన్విరాన్మెంటల్ కమిటీలను కూడా వినియోగిస్తాం. బోర్డర్ చెక్ పోస్టులు అత్యంత బలంగా తయారుచేయాలని సీఎం చెప్పారు. రాష్ట్ర అవసరాలకు మాత్రమే ఎంత ఇసుక అయినా తీసుకెళ్ళచ్చు. ఇందులో ఎవరైనా అక్రమ రవాణా చేస్తే వారిపై పిడి యాక్టు పెడతాం అని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news