ఎక్సైజ్ శాఖ ల్యాబరేటరీని పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర..!

-

ఆంధ్రా యూనివర్సిటీలోని ఎక్సైజ్ శాఖ ల్యాబరేటరీని పరిశీలించారు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. కొత్తగా ఏర్పాటు చేసిన లేబరేటరీలో ఉన్న అత్యాధునిక పరీక్షా విధానం గురించి ఆరా తీశారు. గ్యాస్ క్రోమోటో గ్రఫీ, అటమిక్ అబ్ జాప్షన్ స్పెక్ట్రో స్కోపీ, హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రమోటోగ్రఫీ యంత్రాల పని తీరును గురించి అడిగి తెలుసుకున్న మంత్రికి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మద్యంను 9 రకాలుగా పరీక్షిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. గత పాలనలో ఎలాంటి పరీక్షలు చేయకుండా ప్రజలపై మద్యాన్ని రుద్ది వారి ప్రాణాలు తీశారు.

అయితే మద్యంలో ఉన్న ముడి పదార్థాలను ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకునేలా ల్యాబ్ ఏర్పాటు చేశాం అని పేర్కొన మంత్రి.. ప్రజలకు అందించే మద్యం గురించి ఎలాంటి అపోహలు లేకుండా చేసేందుకే ఈ ల్యాబ్ ఏర్పాటు చేశాం. గత పాలకులు మద్యం వ్యాపారంలోకి దిగి వ్యవస్తలన్నింటిని నాశనం చేశారు. కల్తీ బ్రాండ్ల కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మద్యంలో ఎలాంటి ప్రాణాంతక రసాయనాలు లేకుండా చూడటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. గత సీఎం తెచ్చిన కల్తీ మద్యం కారణంగా లక్షలాది మంది ఇప్పటికీ ఆస్పత్రుల్లో ప్రాణాలతో పోరాటం చేస్తున్నారు అని కొల్లు రవీంద్ర తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version