ఒకే రోజు 105 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం.. కోటంరెడ్డికి మంత్రి నారా లోకేష్ అభినందన

-

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదిక గా అభినందించారు. కోటంరెడ్డి ఒకేరోజు 105 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి రికార్డు సృష్టించారని అందులో పేర్కొన్నారు. దేశ, రాష్ట్ర చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టం అన్నారు. తమ ప్రభుత్వం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందనడానికి ఇది ఉదాహరణ అని లోకేష్ చెప్పారు. 

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకేసారి 105 పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో రూ.191 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్టు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. నెల్లూరు రూరల్ లోని ప్రతీ కాలనీ లో రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. సీఎం చంద్రబాు నాయకత్వంలో అభివృద్ధి అంటే ఏంటో చూపించేందుకే రికార్డు స్థాయిలో పనులు చేపట్టినట్టు తెలిపారు. 60 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version