ఏపీ వారివల్లే హైదరాబాద్‌ అభివృద్ధి – ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ

-

BRS పార్టీని ప్రతిపక్షాలు ఊపిరి ఆడకుండా చేస్తున్నాయని.. శ్రీశైలంలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు.తెలంగాణలో టిఆర్ఎస్ ని రెండు ప్రతిపక్షాలు సతమతం చేసి ఊపిరాన్ని ఇవ్వడం లేదని.. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పకుండా సబ్జెక్టు డైవర్ట్ చేయడం కోసం ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి టీఆర్ఎస్ మంత్రులకు ఏంటి అర్హత అని ప్రశ్నించారు.

ఏపీ ఆధారంగానే హైదరాబాద్ అభివృద్ధి అయింది.. అది మర్చిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంతోషం ఏపీలో ఉంది… దానికి కారణం జగన్ ప్రభుత్వం అని వివరించారు. రజనీకాంత్ ఎన్టీఆర్ శత జయంతికి రావడం సంతోషం.. కానీ ఎన్టీఆర్ గురించి మాట్లాడకుండా అయోగ్యులను పొగిడితే మా కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని ఫైర్‌ అయ్యారు. రజనీకాంత్… ఎన్టీఆర్ గురించి మాట్లాడి ఉంటే బాగుండేది కానీ ఆయన గీత దాటి మాట్లాడారు… పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో భారీ బహిరంగ సభలో ఒక వివరణ ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వం కాపు నాయకుడు ముద్రగడకు అన్ని రకాల ఇబ్బంది పెట్టింది దానిపై ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఒక్కమాట మాట్లాడలేదని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version