తడిచిన ధాన్యం కొ‌నుగోలుచెయ్యకపోవడంపై బొత్స సీరియస్..!

-

తుఫాన్ కారణంగా వరి తడిచి రైతులు ఇబ్బందులు పడుతున్నారు అని బొత్స సత్యనారాయణ తెలిపారు. తడిచిన ధాన్యం కొ‌నుగోలుచెయ్యకపోవడం, క్రాఫ్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం చెల్లొంచకపోవడం… రైతు భరోసా అందించకపోవడం వంటి అంశాలపై ఈ నెల 13న జిల్లా‌ కలెక్టర్ లకు వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించాం. ట్రూ అఫ్ ఛార్జీలు పేరుతా ప్రభుత్వం ప్రజల పై భారం వేస్తుంది.. ఇందికు గాను ఈ నెల 27న విద్యుత్ శాఖ ఎస్సీ ఆఫీసు ఎదుట నిరసన కార్యక్రమం చేపడుతాం.

విద్యార్థులకు ఫీజ్ చెల్లింపు, అమ్మ ఒడి వంటి అంశాలపై వచ్చే నెల 3న నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాం. సూపర్ సిక్స్ ఏమైంది.. ఈసవంత్సరంలో అరవై వేల కోట్లు అప్పు తెచ్చారు. గ్యాస్ సిలెండ్ పెన్షన్ పంపిణీ తప్ప ప్రజలకు ఏమిచ్చారు.. ప్రతి సంవత్సరం మూడు సార్లు పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టాం. ఇప్పుడు ఏదో గొప్పగా చెబుతున్నారు. మిగిలిన పనులను పూర్తు చేస్తామని ఎందుకు చెప్పలేదు. మేము పెట్టిన కర్చీలో చంద్రబాబు కూర్చునారు ఎలా ఉందో చూడండి. తెలుగు మీడియం మేము వదనలేదు.. ఇంగ్లీషు మీడియం.. పక్క రాష్ట్రాలతో పోటీ పడతారన్న ఉద్దేశంతోనే పెట్టాం. టోఫెల్ లో అక్రమాలు జరిగిపోయాయన్నారు.. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా ఇప్పుడు చూడొచ్చు కదా అని ప్రశ్నించారు బొత్స.

Read more RELATED
Recommended to you

Exit mobile version