ఏపీ మహిళలు, రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలు, రైతులకు మంత్రి నారాయణ గుడ్‌న్యూస్ చెప్పారు. ఆగస్ట్ 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామన్నారు. అలాగే, రైతులకు కేంద్రం ఇచ్చే 6 వేలతో కలిపి మొత్తం రూ. 20 వేలు అందజేస్తామన్నారు.

ఇటు మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్ల పైనా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఉపసంఘం సూచనల మేరకు కార్మికులకు న్యాయం జరుగుతుందన్నారు ఏపీ మంత్రి నారాయణ.
ఇక అటు ఆంధ్రప్రదేశ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి కీలక ప్రకట న చేశారు. ఏపీ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెబుతూ.. కీలక ప్రకటన చేశారు. అనారోగ్యంతో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు మూడు లక్షల ఆర్థిక సహాయం చేస్తానని మంత్రి డోల తాజాగా వెల్లడించారు.