ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం : మంత్రి నిమ్మల

-

భారీ వర్ష సూచనతో ప్రభుత్వం అలెర్ట్ అయింది. భారీ వర్షాల వల్ల ఇబ్బందులు రాకుండా ఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు అని మంత్రి నిమ్మల తెలిపారు. ప్రాజెక్టుల్లో ఇన్ ఫ్లోస్ మీద ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. సోమశిల రిజర్వాయరుకు గతంలో రానన్ని ఇన్ ఫ్లోస్ వస్తన్నాయి. ముందుగానే చెరువులు, వాగులు, రిజర్వాయర్లు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇటీవల కాలంలో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినా ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, కడప వంటి జిల్లాల్లో వాగుల్లో ఇన్ ఫ్లోస్ పరిశీలిస్తున్నాం. వాగుల క్యాచ్మెంట్ ఏరియాలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం.

వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు ఉంటాయని అంచనా. ఆర్టీజీఎస్ సహకారంతో నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నాం. ఇంకా కొన్ని జలశయాల్లో నీరు నింపలేని పరిస్థితి. గత ఐదేళ్ల పాపం రాష్ట్రాన్ని పీడిస్తోంది. పెన్నా బేసిన్లోని రిజర్వాయర్లల్లో నీటిని నింపలేకపోతున్నాం. గత ఐదేళ్లల్లో ఇరిగేషన్ వ్యవస్థను నాశనం చేశారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా రిజర్వాయర్లల్లో నీటిని నింపే ప్రయత్నం చేస్తున్నాం. ఏపీలోని రిజర్వాయర్లల్లో మొత్తంగా 760 టీఎంసీల కెపాసిటీతో నీటిని నిల్వ చేయొచ్చు. ప్రస్తుతం 680 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగాం. ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. వరదలు, వర్షపు నీటిని ఒడిసి పట్టేలా చర్యలు తీసుకుంటాం అని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news