ఏపీ వ్యాప్తంగా ముగిసిన మద్యం దుకాణాల కేటాయింపు..!

-

ఏపీ వ్యాప్తంగా మద్యం దుకాణాల కేటాయింపు ప్రశాంతంగా ముగిసింది. లాటరీ విధానం ద్వారా దరఖాస్తుదారులకు షాపుల కేటాయింపు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 దుకాణాల లాటరీ ద్వారా కేటాయించగా.. వీటి కోసం మొత్తం 89,882 దరఖాస్తులు వచ్చాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, యూపీ రాష్ట్రాల నుంచి టెండర్లు వేసి షాపులు దక్కించుకున్నారు వ్యాపారులు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచరులకు 3 నుంచి 5 వరకు షాపులు దక్కాయి. 50 నుంచి 100 షాపులకు దరఖాస్తులు చేసిన సిండికేట్ కి ఐదు నుంచి 10 షాపులు దక్కాయి.

విశాఖ, విజయవాడ, కృష్ణ వంటి పలు జిల్లాల్లో మద్యం దుకాణాలను చేజిక్కించుకున్నారు మహిళలు. ఎన్టీఆర్ జిల్లాలో 16, కృష్ణా జిల్లాలో ఏడు, విశాఖ జిల్లాలో 11 షాపులను కైవసం చేసుకున్నారు మహిళలు. సిండికేట్ గా ఏర్పడి 10 నుంచి 30 వరకు షాపులు వేసినా అదృష్టం తలుపు తట్టకపోవడంతో నిరాశతో వెనక్కి తిగిగారు దరఖాస్తుదారులు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు షాపులు కేటాయింపు ప్రక్రియ కొనసాగింది. ఇవాళ షాపు పొందిన వారి నుంచి డబ్బు కట్టించుకొని ప్రొవిజనల్ లైసెన్స్ ఇస్తున్నారు అధికారులు. రేపు సాయంత్రం నుంచి డిపోలో స్టాక్ తీసుకొని 16వ తారీఖున దుకాణాలు తెరవనున్నారు వ్యాపారులు.

Read more RELATED
Recommended to you

Latest news