ప్రకాశం బ్యారేజీకి నాలుగు బోట్లు గుద్దుకోవడం వెనుక కుట్ర కోణం : మంత్రి నిమ్మల

-

11.80 లక్షల క్యూసెక్కుల వరద నీరు కృష్ణా నదికి వస్తుంది. ఇది కృష్ణానది చరిత్రలోనే అతి ఎక్కువ ఫ్లడ్ అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పరిపాలనాదక్షుడు చంద్రబాబు సీఎంగా ఉండటంతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇవాళ రాత్రికి బుడమేరుకు పడ్డ మూడు గండ్లను పుడుస్తాం. ఇందు కోసం అధికారులు తీవ్రంగా పనిచేస్తున్నారు. కరకట్టపై మంతెన సత్యనారాయణ రాజు బిల్డింగ్ వద్ద షట్టర్ కి గ్రీజ్ కూడా పెట్టలేదు. ఇక ప్రకాశం బ్యారేజీ గేట్లకు బొట్లు తగిలి గేట్లు కొంత డామేజయ్యాయి. గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు దాని మరమత్తులు చేయనున్నారు.

ప్రస్తుతానికి గేట్లు వలన ఇబ్బంది లేదు. అతి తక్కువ గంటల్లో భారీగా వర్షం పడింది. వరద ప్రభావం లేని అధికారులను విజయవాడకి తెప్పిస్తున్నాం. చుట్టూ పక్కల నగరాల నుంచి ఫుడ్ ప్యాకెట్లను రప్పిస్తున్నాం. ప్రకాశం బ్యారేజీకి ఒకేసారి నాలుగు బోట్లు గుద్దుకోవడం వెనుక కుట్ర కోణం లేకపోలేదు అని మంత్రి అనుమానం వ్యక్తం చేసారు. ఇప్పుడు హైదరాబాద్, చెన్నై లాంటి మహా నగరాలు చిన్న వర్షాలకే మునిగిపోతున్నాయి. కానీ అమరావతికి ఎలాంటి ప్రమాదం లేదు అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news