Minister Nimmala Ramanaidu: కాళ్లు కడిగి మరీ పెన్షన్ ఇచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు

-

Minister Nimmala Ramanaidu Distributes Pension: కాళ్లు కడిగి పెన్షన్ అందించారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. ఆంద్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పెన్షన్లు అందజేశారు.

Minister Nimmala Ramanaidu Distributes Pension

ఈ క్రమంలో వృద్ధులు, వికలాంగుల కాళ్లు కడిగి నగదును అందించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని మంత్రి నిర్మల స్పష్టం చేశారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది ఇలా ఉండగా, పేదవాడి ఇంట్లో టీ తాగారు సీఎం చంద్రబాబు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో ఓ ఎస్టీ కుటుంబానికి సీఎం చంద్రబాబు పెన్షన్ అందించారు. పాముల నాయక్‌కు వృద్ధాప్య పెన్షన్, కుమార్తెకు వితంతు పెన్షన్ అందజేశారు. అనంతరం వారి ఇంట్లోనే టీ తాగి అరగంట పాటు వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version