గత ప్రభుత్వం చేసిన పనులతో మేము ఇబ్బందులు పడుతున్నాం : మంత్రి నిమ్మల

-

93 శాతం స్ట్రైక్ రేటులో ఎలా గెలిచామో.. రాబోయే ఎన్నికల్లో కూడా అదే స్ట్రైక్ రేట్ రావాలి. నాయకుల మధ్య.. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ సోషల్ మీడియా పని చేస్తుంది అని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. ఇసుక వ్యాపారం చేయరాదు.. అమల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వం ఇసుక లూటి చేయడంతో గ్రీన్ ట్రిబ్యునల్ కేసుల వల్ల కొన్ని ఇబ్బందులు పడుతున్నాం అని పేర్కొన్నారు.

అలాగే పంచాయతీ సెక్రెటరీ లెటర్ తీసుకొని.. ఇంటికి ఇసుక తీసుకు వెళితే.. అధికారులు అడ్ఠుకుంటే వారిని సస్పెండ్ చేస్తాం. గోదావరి జిల్లాలో ఒక్కో రీచ్ కు రూ.30 కోట్లు కట్టేలా గత ప్రభుత్వంలో చేసింది. ఆ డబ్బును కట్టలేక కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అక్రమ వ్యాపారం చేస్తే.. తన మన అన్న బేదం లేకుండా అందరిపై చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు అవసరం ఉంది. 8 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. 2 లక్షల ఎకరాలకు నీళ్లు అందడంలేదు. నాడు ఎన్టీఆర్.. నేడు చంద్రబాబు నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చారు. అసంపూర్తిగా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం అని మంత్రి నిమ్మల మాట ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version