ఏపీ సచివాలయంలో ధరల పర్యవేక్షణపై మంత్రుల కమిటీ భేటీ..!

-

ఏపీ సచివాలయంలో రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల, వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ధరల పర్యవేక్షణ పై మంత్రుల కమిటీ సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే ఇందులో బియ్యం, కందిపప్పు, టమోటా, ఉల్లి ధరల నియంత్రణపై చర్చ జరిపారు. టమోటా, ఉల్లి నిల్వ చేసుకునే పద్ధతులపై మంత్రుల కమిటీ అధ్యయనం చేసింది. ప్రస్తుత మార్కెట్ లో ధరల పరిస్ధితిని సమీక్షించారు మంత్రులు, అధికారులు. ప్రత్యేక కౌంటర్లలో అమ్మకాల ద్వారా బియ్యం ధరల స్థిరీకరణ జరిగినట్లు అలాగే కందిపప్పు ధరలు తగ్గినట్లు గుర్తించారు.

ఇక కేంద్రం దిగుమతి సుంకం పెంపుతో వంటనూనె ధరలు పెరిగినట్లు గుర్తించారు. పెరిగిన వంటనూనె ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేక కౌంటర్ల ద్వారా లీటర్ పామాయిల్ 110 రూపాయలకు అమ్ముతుంది ప్రభుత్వం. దిగుమతి దారులు, హోల్ సేల్ నిర్వాహకులు, రిటైల్ దారులతో ప్రభుత్వం చర్చలు జరిపి అనంతరం రాయితీ ధరలపై వంటనూనెను అమ్మకానికి క్యూ ఆర్ కోడ్ ద్వారా అమ్మకాలు చెప్పటింది. రాష్ట్రవ్యాప్తంగా బియ్యం కందిపప్పు పంచదారను సబ్సిడీ ధరలకు సప్లై చేస్తుంది. ఇక కూటమి ప్రభుత్వ చర్యలతో గత నెలలో ఉల్లి, టమోటో ధరలు తగ్గిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version