బాబు-కిరణ్‌లతో రేవంత్-కిషన్‌కు చెక్ ..మళ్ళీ వర్కౌట్ అవుతుందా?

-

తెలంగాణలో ఆంధ్రా వాళ్ళ పెత్తనం…ఇదే బీఆర్ఎస్ పోలిటికల్ పాయింట్. మరొకసారి ఎన్నికల్లో లబ్ది పొందడానికి బి‌ఆర్‌ఎస్ ప్రయత్నిస్తుందా? మళ్ళీ ఆంధ్రా నేతలని బూచిగా లబ్ది పొందాలని అనుకుంటుందా? ఇటీవల బి‌ఆర్‌ఎస్ నేతలు చేస్తున్న కామెంట్స్ బట్టి చూస్తే అది నిజమే అనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2014లో తెలంగాణ తెచ్చిన సెంటిమెంట్ తో కే‌సి‌ఆర్..అధికారంలోకి వచ్చారు. బొటాబోటి మెజారిటీతో అధికారంలోకి వచ్చారు..కానీ తర్వాత బంగారు తెలంగాణ అని చెప్పి..టి‌డి‌పి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని పెద్ద ఎత్తున చేర్చుకున్నారు.

అయితే 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు తమ ఐదేళ్ల పాలనకి రిఫరెండంగా ఎన్నికలకు కే‌సి‌ఆర్ వెళ్లలేదు. కేవలం కాంగ్రెస్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకోవడంతో..మళ్ళీ బాబు తెలంగాణపై పెత్తనం చేయడానికి వస్తున్నారని ప్రచారం చేసి అప్పుడు లబ్ది పొందారు. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. సరే ఏది ఎలా జరిగిన కే‌సి‌ఆర్‌కు ప్రజల మద్ధతు లభించింది. ఇప్పుడు మూడోసారి కూడా అధికారంలోకి రావాలని బి‌ఆర్‌ఎస్ ప్రయత్నాలు చేస్తుంది.

అయితే తమ పాలన రిఫరెండంగా కాకుండా మొన్నటివరకు కేంద్రంలోని బి‌జే‌పిని టార్గెట్ చేశారు..ఇప్పుడు కాంగ్రెస్ బలపడుతుండటంతో అదిగో రేవంత్ రెడ్డి..చంద్రబబు శిష్యుడు అంటూ రాజకీయం నడిపిస్తున్నారు. పైగా మాజీ సి‌ఎం కిరణ్ కుమార్ రెడ్డి బి‌జే‌పిలో చేరారు. ఆయన సమైఖ్యాంధ్ర కోసం పోరాడిన విషయం తెలిసిందే. దీంతో కిరణ్ పేరుతో బి‌జే‌పిని టార్గెట్ చేస్తున్నారు.

తాజాగా మంత్రి హరీష్ రావు…చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిల గురించి కామెంట్ చేశారు.  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి చెప్పినట్లు వింటున్నారని, మరోవైపు చంద్రబాబు చెప్పినట్లు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వింటున్నారని,  కిషన్‌ రెడ్డి గురువు కిరణ్‌ కుమార్‌ రెడ్డి అని, చంద్రబాబు శిష్యుడు రేవంత్‌ రెడ్డి అని అన్నారు. వీరిద్దరి వల్ల తెలంగాణ బతుకులు ఆగమైపోతాయని అన్నారు. అంటే మళ్ళీ ఆంధ్రా పెత్తనం అనే అంశాన్ని తీసుకొచ్చి ఎన్నికల్లో లబ్ది పొందాలనేది బి‌ఆర్‌ఎస్ టార్గెట్ గా ఉంది. మరి ఈసారి వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version