మాస్ స్టెప్పులతో మంత్రి రోజా డాన్స్..వీడియో వైరల్

వచ్చే నెల 21న ముఖ్యమంత్రి జగన్ జన్మదినం ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 19న తిరుపతి వేదికగా వీటిని మంత్రి రోజా ప్రారంభించారు. మూడు రోజులపాటు తిరుపతిలో ఈ ఉత్సవాలు జరిగాయి.

ప్రారంభం రోజున మంత్రి రోజా దింసా-బంజారా డాన్స్ చేస్తూ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. బంజారా డాన్స్ లో వేసిన స్టెప్పులలో పార్టీ అభిమానుల కేరింతలతో తిరుపతి తో మహతి స్టేడియం మార్మోగింది. ఇక తిరుపతి తర్వాత ఈరోజు గుంటూరులో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో కళాకారులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా డప్పు వాయిస్తూ స్టెప్పులు వేశారు. ఎమ్మెల్యేకు దీటుగా మంత్రి రోజ స్టేజ్ పైన కళాకారులతో కలిసి డ్యాన్స్ చేశారు.