సచివాలయం తాకట్టు పెట్టొద్దని రాజ్యాంగంలో ఉందా… కొడాలి నాని..!

-

సెక్రటేరియట్ ఏమైనా చంద్రబాబుదా? అంటూ మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్‌ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వానికి అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టుకోవచ్చు అన్నారు. ఆస్తులు తాకట్టు పెట్టకూడదని ఏమైనా రాజ్యాంగంలో రాసి ఉందా అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు కొడాలి నాని. ప్రజలకు అవసరమైనప్పుడు.. ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టడం మామూలే అన్నారు.

MLA Kodali Nani on AP Secretariat

సచివాలయం అనేది పది ఎకరాల ఆస్తి మాత్రమే.. ప్రత్యేకించి ఏ ఆస్తులు తాకట్టు పెట్టాలో అనే విషయం రాజ్యాంగంలో ఏమైనా రాశారా..? అంటూ విషయం రాజ్యాంగంలో ఏమైనా రాశారా..? అంటూ ప్రశ్నించారు. ప్రజల అవసరాల కోసం.. ప్రభుత్వ వేసులుబాటును బట్టే ఆస్తులు తాకట్టు పెట్టడం జరుగుతుందన్నారు. చిల్లర రాజకీయ నాయకుడు అంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. చంద్రబాబు చేస్తేనే సంసారం.. మిగతా వాళ్లు చేస్తే కాదన్నట్టుగా ఆయన వ్యవహారం ఉంటుందంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని.

 

Read more RELATED
Recommended to you

Latest news