రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దారుణం చోటు చేసుకుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అధికారులు అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధాన బుకింగ్ లో నిబంధనలకు విరుద్ధంగా సేవాదారులకు విధులు అప్పగిస్తున్నారు. లక్షలాది రూపాయల కౌంటర్ ను తాత్కాలిక సిబ్బందికి అప్పగించారట ఆలయ అధికారులు.
ఆలయంలో సేవా విధులు నిర్వహించాల్సిన సేవాదారులకు ప్రధాన బుకింగ్ లో నిబంధనలకు విరుద్ధంగా విధులు అప్పగిస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి పల్లకి ఊరేగింపులు, లడ్డుల పంపిణీ లాంటి పనులకోసమే సేవాదారులను నియమించింది దేవాదాయ శాఖ. మెయిన్ బుకింగ్ విధులు అప్పగించడంతో ఆందోళన చెందుతున్నారు సేవాదారులు. డిసిఆర్ రాయడంలో అవకతవకలు జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు సేవాదారులు. పట్టించుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంతో సమాధానం ఇస్తున్నారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.