ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేశారు టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. తన చేతికి మట్టి అంటకుండా జగన్ క్రిమినల్ పనులు చేస్తారని ఆరోపించారు. జగన్ క్రిమినల్ పనులకు ప్రత్యక్ష ఉదాహరణ వైఎస్ వివేకా హత్యేనన్నారు. గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చిన జగన్ సీఎంగా రాష్ట్రానికి అవసరమా..? అని ప్రశ్నించారు నిమ్మల. వివేకా హత్య మీద సీబీఐ విచారణ కోరి.. అధికారంలోకి రాగానే సీబీఐ విచారణ అక్కర్లేదన్నారని మండిపడ్డారు.
అవినాష్ రెడ్డిని రక్షించకుంటే తాడేపల్లి కుట్ర బయటకు వస్తుందని జగన్ ఢిల్లీకి పరుగులు పెట్టారని ఆరోపించారు. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు వివేకా క్యారెక్టరుపై దిగజారి విమర్శలు చేశారని.. అఫిడవిట్లు వేశారన్నారు. నిందితుల కుటుంబ సభ్యులతో వివేకాకు అక్రమ సంబంధాలు అంటగట్టడం ఎంత వరకు కరెక్ట్ అని నిలదీశారు నిమ్మల. చిన్నాన్న సౌమ్యుడు.. ఈ విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయకూడదని జగన్ చెల్లి షర్మిళే చెప్పారని అన్నారు. జగనన్నే మా నమ్మకం అనే స్టిక్కర్లు చెల్లెళ్లు షర్మిళ, సునీత ఇళ్లకు అతికించగలరా..? అని ప్రశ్నించారు.