నందిగామ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు వేధింపులపై కేంద్ర కార్యాలయానికి వచ్చింది క్యాడర్. పెండ్యాల గ్రామంలో వాట్సప్ గ్రూపులోని 170 మందికి నోటీసులు పంపిన విషయంపై ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కీలక కామెంట్స్ చేసారు. ఏపీలో ప్రభుత్వ అరాచకం పెరిగిపోయింది. వాట్సప్ గ్రూపులో పోస్టులు పెట్టుకున్నా కేసులు పెడుతున్నారు. నందిగామ నియోజకవర్గం పెండ్యాల గ్రామంలో ఏకంగా 170 మంది గ్రూపు సభ్యులపై కేసులు పెట్టారు. అందరినీ పోలీసు స్టేషను కు పిలిపించి చిత్రవధలు పెడుతున్నారు.
ప్రపంచ చరిత్రలో ఇంతటి దారుణం ఎక్కడా జరగలేదు. మరి టీడీపీ గ్రూపుల్లో వైఎస్ జగన్ మీద దారుణంగా ట్రోల్స్ చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు.. ఆ టీడీపీ కార్యకర్తలకు నోటీసులు ఇచ్చే దమ్ము డీజీపికి ఉందా అని ప్రశ్నించారు. అలాగే వైసీపి కార్యకర్తలను స్టేషన్లు మార్చి మార్చి కొడుతున్నారు. దారుణంగా వ్యవహరిస్తున్న వారిపై ప్రయివేటు కేసులు వేస్తున్నాం అని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ తెలిపారు.