ఇది రైతు ప్రభుత్వం కాదు రాబందుల ప్రభుత్వం : హరీష్ రావు

-

రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ. సమయానికి ప్రభుత్వం వడ్లు కొనకపోవడంతో ధాన్యం దళారుల పాలయ్యింది అని హరీష్ రావు అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 91 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని గొప్పలు చెప్పారు. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి గింజ కొన్నారు. ఇప్పుడు మాత్రం ధాన్యం కొనే నాధుడే లేడు. నెల రోజులైనా వడ్లు కొనడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. రేవంత్ రెడ్డి తప్పిదం వల్ల రైతులు దళారులకు అమ్ముకుని తీవ్రంగా నష్టపోతున్నారు.

ఇక సీఎం రేవంత్ కి అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే అని చెప్పిన హరీష్ రావు.. బర్త్ డే రోజు యదాద్రికి వెళ్తున్న సీఎం రేవంత్ ఇచ్చిన మాట తప్పినందుకు ముక్కు నెలకు రాయాలి. పాలకుడే పాపత్ముడైతే ఆ రాజ్యానికి అరిష్టం. ఇది రైతు ప్రభుత్వం కాదు రాబందుల ప్రభుత్వం. వానాకాలం, యాసంగి కి సంబంధించిన రైతు బంధు డబ్బులు వెంటనే ఇవ్వాలి. రుణమాఫీ ఆగస్ట్ 15 లోపు చేస్తానని రేవంత్ ప్రతి ఒక్క దేవునిపై ఒట్టుపెట్టారు అని హరీష్ రావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news