రాయలసీమ వాసులకు మోడీ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త

-

రాయలసీమ ప్రజలకు మోడీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. బెంగళూరు నుంచి కర్నూల్ కు విమాన సర్వీసులు… పునః ప్రారంభించాలని… పార్లమెంట్ వేదికగా… తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు బైరెడ్డి శబరి కోరారు. దీంతో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు…. టిడిపి ఎంపీ బైరెడ్డి శబరి డిమాండ్ పై స్పందించారు. వెంటనే… ఇండిగో ఎయిర్ లైన్స్‌… బెంగళూరు నుంచి కర్నూలుకు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని రామ్మోహన్ నాయుడు కూడా ప్రకటన చేశారు.

Modi government is a good news for the people of Rayalaseema

గతంలో ఈ సర్వీస్ నడిచేది.కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఇది ఆగిపోయింది. అంతేకాకుండా… ఆగస్టు 18 వ తేదీ నుంచి సోమ బుధ శుక్రవారం లో ఈ సర్వీస్.. నడిచేలా కేంద్రమంత్రి అధికారిక ప్రకటన చేశారని శబరి తెలిపారు. కర్నూలు నుంచి విజయవాడ వరకు అక్టోబర్ ఆఖరి నుంచి సర్వీస్ నడిచేలా చర్యలు తీసుకుంటామని… కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. ఇక ఓర్వకల్లు ఎయిర్ పోర్టు రన్వే పొడిగింపు పై కూడా కేంద్రం కీలక ప్రకటన చేసినట్లు తెలిపారు. దానికి కావలసిన… బడ్జెట్ను కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చిందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version