ఓమైగాడ్.. క్యాబ్‌ ఖర్చే ₹16 వేలట.. కారు కొనుక్కోవచ్చుగా అంటూ నెటిజన్ల సలహాలు

-

రోజూ ఆఫీసుకెళ్లి వచ్చేవారు అద్దె ఎక్కువైనా పర్లేదు ఆఫీసుకు దగ్గర్లోనే ఉండేందుకు ఇష్టపడతారు. కొంతమందేమో జర్నీ ఎక్కువైనా రెంట్ తక్కువుండాలనుకుంటారు. అలా ఆఫీసుకు దూరంగా ఉన్న వాళ్లు క్యాబ్లలోనో, ప్రజా రవాణా ద్వారానో వెళ్తారు. అలా ఓ యువతి రోజూ క్యాబ్లో ఆఫీసుకు వెళ్తోంది. తీరా నెల దాటాక లెక్కలేసుకుంటే ఇంటి అద్దెలో సగం కంటే ఎక్కువ ఈ క్యాబ్‌కే ఖర్చవుతుందట. ఈ లెక్కలను ఆమె సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఆ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

బెంగళూరులో వన్షిత అనే యువతి క్యాబ్‌ కోసం తాను ఎంత ఖర్చు చేస్తున్నదీ క్రెడ్‌ యాప్‌లో ట్రాక్‌ చేసింది. అందులో జులై 1 నుంచి 25 వరకు ఉబర్‌ క్యాబ్స్‌లో మొత్తం 74 ట్రిప్పులు తిరిగినట్లు కనిపించింది. దానికైన ఖర్చు అక్షరాలా రూ.16వేలు పైనే కావడంతో షాక్ అయింది. తన ఇంటి అద్దెలో సగం కంటే ఎక్కువ క్యాబ్‌కే పోయాల్సి వస్తోందంటూ నెట్టింట పోస్ట్‌ చేసింది. ఈ పోస్ట్ పెట్టిన కాసేపటికే ఈ పోస్టు వైరల్‌గా మారడంతో ‘నెల నెలా అంతేసి ఖర్చు చేసే బదులు సొంతకారు కొనుక్కుని ఈఎంఐ చెల్లించడం మేలు’ అంటూ ఓ యూజర్‌ కామెంట్‌ చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version