కడప ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో నిరాశ ఎదురైందనే చెప్పాలి. ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి, తండ్రి భాస్కర్ రెడ్డి.. తమ ముందస్తు బెయిల్ కండిషన్లను సడలించాలని కోరుతూ.. తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేసినపుడు వారిద్దరూ దేశం విడిచి
వెళ్లరాదని కోర్టు షరతు విధించింది.
తాజాగా వారి పిటిషన్ పై విచారణ హైకోర్టు విచారణ చేపట్టింది కోర్టు. ఈ నెల 26వ తేదీ నుంచి నవంబర్ 2 వరకూ తాము జపాన్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరారు. అందుకు నిబంధనలను సడలించాలని కోర్టుకు అవినాష్, భాస్కర్ రెడ్డిల తరఫు లాయర్ విజ్ఞప్తి చేయగా.. ఈ విషయంపై సీబీఐ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టులో పిటిషన్ వేసుకోవాలని తెలిపింది. దీంతో అవినాష్ కు కోర్టులో నిరాశ ఎదురైందనే చెప్పవచ్చు.