పులివెందుల ZPTC ఎన్నికపై ఎంపీ బైరెడ్డి శబరి కామెంట్స్ చేశారు. మా కార్యకర్తల కోసం రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మేము వెళ్తామన్నారు. ఐదేళ్లు సీఎంగా ఉండి పులివెందుల, కడప జిల్లాలో ఏం అభివృద్ధి చేశారు? అని నిలదీశారు ఎంపీ బైరెడ్డి శబరి. ఈ ఉపఎన్నికతో పులివెందుల ఎవరి అడ్డా అనేది తెలిసిపోద్దని వెల్లడించారు.

ఓడిపోతున్నామని తెలిసే దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. బీటెక్ రవి ఎన్నో ఏళ్లుగా పులివెందులలో పోరాడుతూ వస్తున్నారన్నారు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి.