BREAKING : వైసీపీలో చేరనున్న ఎంపీ కేశినేని నాని ?

-

తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్‌ తగిలే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది. వైసీపీలో చేరేందుకు ఎంపీ కేశినేని నాని రంగం సిద్దం చేసుకున్నారని సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే.. నేడు సీఎం జగన్ ను కేశినేని నాని కలిసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. బెజవాడ ఎంపీ సీటు కేశినేనికి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

MP Keshineni Nani to join YCP

ఇప్పటికే నానితో పలుమార్లు సమావేశమైయ్యారట వైసీపీ కీలక నేతలు. ఇప్పటికే బెజవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న పలువురు వైసీపీ సిట్టింగ్ ఎంఎల్ఏ లతో కేశినేని నానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ తరుణంలోనే…వైసీపీలో చేరేందుకు ఎంపీ కేశినేని నాని రంగం సిద్దం చేసుకున్నారని సమాచారం అందుతోంది. కాగా ఇటీవలే తెలుగు దేశం పార్టీకి ఎంపీ కేశినేని నాని రాజీనామా చేసినట్లు ప్రకటించారు. చంద్రబాబు పార్టీకి దూరంగా ఉండాలని చెప్పాడని.. అందుకే రాజీనామా చేసినట్లు తెలిపారు ఎంపీ కేశినేని నాని. అటు ఎంపీ కేశినేని నాని కూతురు కూడా రాజీనామా చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news