అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్‌పై హత్యాయత్నం!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి. కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. అయితే తాజాగా భూమా అఖిలప్రియ కు ఊహించని షాక్ తగిలింది. అర్ధరాత్రి ఆళ్లగడ్డలో అఖిలప్రియ బాడీగార్డ్ నికిల్ పై దాడి జరిగింది. మొదటగా కారుతో నిఖిల్ ను కారుతో ఢీ కొట్టారు కొంతమంది దుండగులు. ఆ తర్వాత అతనిపై రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలుస్తోంది.

murder-attempt-on-akhilapriyas-bodyguard-nikhil

అయితే ఈ దాడిలో నిఖిల్ తీవ్రంగా గాయపడ్డాడని సమాచారం. అనంతరం అతన్ని నంద్యాల ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. పాత పగతో ఏవి సుబ్బారెడ్డి మనుషులే ఈ పని చేయించి ఉంటారని వార్తలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో… దాడి చేస్తే… మొత్తం వైసీపీ వైపు కేసు వెళుతుందని… ఈ సందర్భంగా సుబ్బారెడ్డి చేసినట్లు కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news