ముస్లిం యువకులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేయడం ఇప్పుడు కలకలంగా మారింది. పవన్ కళ్యాణ్ ఉగ్రవాదుల గురించి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ముస్లిం యువకులు ఫిర్యాదు చేశారు. ముస్లింలు ఉగ్రవాదులు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ద్వేషపూరితంగా ఉన్నాయని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ముస్లింల గుర్తింపు అయిన టోపీలు, గడ్డాలు, కుర్తాలు, స్కార్ఫ్ ను పవన్ కళ్యాణ్ ఉగ్రవాదానికి చిహ్నాలుగా ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు పవన్. ఈ వ్యాఖ్యలు ద్వేషపూరితంగా ఉన్నాయని.. ముస్లింలను కించ పరిచే విధంగా ఉన్నాయని ఆయన పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జహీరాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఖాజా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.