పెళ్లి తర్వాత జీవితం పూర్తిగా మారుతుంది. ముఖ్యంగా అమ్మాయిలు పెళ్లి తర్వాత ఎన్నో మార్పులను ఎదుర్కొంటారు. పైగా అటువంటి సమయంలో మార్పులకు అలవాటు పడేందుకు చాలా సమయం అవసరం. మంచి వాతావరణం ఉన్న కుటుంబ సభ్యులతో జీవిస్తే కష్టాలు తక్కువగా ఉంటాయి. కాకపోతే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని వ్యవహరించకపోతే, అమ్మాయి జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. కోడళ్ళు అత్తమామలతో మంచి సంబంధం కలిగి ఉంటేనే వారి జీవితం ఆనందంగా సాగుతుంది. ఇంటి వాతావరణం సరిగ్గా లేకపోతే, అత్తమామలతో కలిసి జీవించడం చాలా కష్టంగా మారుతుంది.
పెళ్లయిన తర్వాత అమ్మాయిలు పుట్టింటి నుంచి అత్తవారి ఇంటికి వెళ్లడం సహజమే. అయితే, కొన్నిసార్లు ఎన్నో కారణాల వల్ల అత్తమామల నుంచి కూడా విడిపోవాల్సి వస్తుంది. వివాహం తర్వాత అత్తమామల ఇంట్లో జీవితం కొత్త అనుభవంగా ఉంటుంది. పైగా, అత్తమామలతో కలిసి జీవించడం కూడా చాలా సార్లు సవాలుగా మారుతుంది. భర్త అండగా ఉండకపోతే అత్త కోడళ్ళ మధ్య గొడవలు ఏర్పడటం, విమర్శలు ఎదుర్కోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. దాని వల్ల జీవితం మరింత కష్టమవుతుంది. దీనివల్ల ఆనందంగా జీవించడం అసాధ్యం. అత్తమామలు ఎప్పుడూ కోడళ్ళను ఇతరులతో పోల్చకూడదు. అలా చేయడం వలన కోడలి జీవితం మరింత సమస్యగా మారుతుంది.
ఎప్పుడైతే కోడలితో ప్రేమతో వ్యవహరిస్తారో, అప్పుడే వివాహం తర్వాత కొత్త ఇంటి వాతావరణం అలవాటు అవుతుంది. సరైన వాతావరణం లేకపోవడం వలన కొత్త మార్పులను స్వీకరించటం కష్టమవుతుంది. అత్తవారింటిలో కొత్తగా ఉండడం వల్ల ఎప్పుడూ ఎవరి పర్యవేక్షణలో ఉన్నట్లు భావిస్తారు. దీనివల్ల వివాహం తర్వాత ఎన్నో కష్టాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. అత్తగారు, మామగారు తల్లిదండ్రులుగా ఎప్పటికీ చూసుకోలేరు. కానీ విమర్శించడం, అవమానించడం వంటివి లేకపోతే కోడలి జీవితం మంచిగా కొనసాగుతుంది.