మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ జనసేనలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఆయన పూర్తి చేసుకున్నట్టు సమాచారం. జనసేనలోకి వెళ్తేనే తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మైలవరం నియోజకవర్గం నుంచి జనసేన తరపున ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు టాక్. కాగా, త్వరలోనే వసంత వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కాగా, వైఎస్ఆర్సీపీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఆరవ జాబితాను విడుదల చేసింది. ఏపీలో అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ ఎన్నికల వేడి మొదలైంది. అన్ని పార్టీలు ఎన్నికల రణరంగంలో గెలుపుకోసం కసరత్తులు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తన అభ్యర్థులను విడతల వారీగా 5 జాబితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్సీపీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఆరవ జాబితాను విడుదల చేయడంతో వసంత అసంతృప్తి గా ఉన్నారని సమాచారం. అందుకే ఆయన జనసేన పార్టీలో చేరనున్నారని సమాచారం.