ఆరు నెలలు ఓపిక పడితే జగన్ ఇంటికే.. నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

ప్రతిపక్షాలపై దాడులు చేయడంతో పాటు తప్పుడు కేసులు పెట్టే కొత్త సంప్రదాయానికి వైసీపీ ప్రభుత్వం తెర తీసిందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. గతంలో భీమవరం, విశాఖలో తమ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలలో వైసీపీ నేతలు రెచ్చగొట్టడంతో పాటు దాడులు చేశారని ఆరోపించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలోను వైసీపీ అల్లరి మూకలు అలాగే చేస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ మేరకు వైసీపీ నేత చర్యలను పోలీసు కేసులను జనసేన తరపున తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించారు నాదెండ్ల మనోహర్. ప్రతిపక్షాల ర్యాలీలలో వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే బ్యానర్లు కడుతున్నారని.. దీనిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆరు నెలలు ఓపిక పడితే జగన్ ని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ సందర్భంగా మా మొదటి ఓటు జనసేనకే అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లనున్నట్టు మనోహర్ తెలిపారు. ఇందుకు సంబంధించి వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. 

Read more RELATED
Recommended to you

Latest news