చిరంజీవి ఫ్యాన్స్ ను నాగబాబు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: మాజీ మంత్రి వెల్లంపల్లి

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రానికి పనికిరాడని.. చిరంజీవి లేకుండా పవన్ కళ్యాణ్ ఎవరికి తెలుసన్నారు. మెగాస్టార్ లేనిదే పవర్ స్టార్ ఎక్కడ అంటూ ప్రశ్నించారు. నాగబాబుకి విధి విధానం లేదని.. చిరంజీవి ఫ్యాన్స్ ని నాగబాబు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అన్నారు.

చిరంజీవి ఫ్యాన్స్ మొత్తం జనసేన కి సపోర్ట్ చేయాలి అని నాగబాబు చెప్పడం చిరంజీవిని అవమానించడమే అన్నారు. పవన్ కళ్యాణ్ మాటల వ్యక్తే.. తప్ప చేతల వ్యక్తి కాదన్నారు. మొట్టమొదట అమిత్షా అపాయింట్మెంట్ తీసుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడాలన్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా ల కు పవన్ వెధవ వేషాలు తెలుసని, బీజేపీతో పొత్తు లో ఉన్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర సంక్షేమం కోసం ఒక్క రోజైనా పని చేశారా అంటూ ప్రశ్నించారు.