కనిపిస్తే కాల్చేయండి.. ఇజ్రాయెల్ దళాలకు ఆదేశాలు జారీ..!

-

హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ దాడులను మరింత తీవ్రతరం చేసింది. గాజా వెంబడి సరిహద్దులను ఇజ్రాయెల్ సైన్యం దాదాపు తమ ఆధీనంలోకి తీసుకుంది. మిలిటెంట్ల చొరబాట్లకు ఇంకా ముప్పు పొంచి ఉన్న వేళ.. సరిహద్దుల్లోని దళాలకు కీలక ఆదేశాలుంటాయి. గాజా వైపు నుంచి ఎవరైనా సరిహద్దులను దాటే ప్రయత్నం చేస్తే వారిని కాల్చేయాలని చెప్పింది. ఈ మేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దళాలకు షూట్ ఆన్ సైట్ ఆదేశాలు జారీ అయ్యాయి.

మరోవైపు గాజాలోని హమాస్ స్థావరాలపై వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి సామాన్య పౌరులు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ దళాలు సూచించాయి. అయితే గాజా స్ట్రిప్ లోని పౌరులు ఈజిప్ట్ కి వెళ్లాలని ఇజ్రాయెల్ సూచించినట్టు వచ్చిన వార్తలు ఐడీఎఫ్ తిరస్కరించింది. గాజాలో ఇజ్రాయెల్ దాడులతో భారీగా ప్రాణనష్టం సంభవించినట్టు పాలస్తీనా అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు 770 మంది మరణించగా.. మరో 4వేల మంది గాయపడినట్టు తెలిపారు. అటు హమాస్ జరిపిన మారణహోమంలో దాదాపు 3వేల మంది ఇజ్రాయెల్ పౌరులు గాయపడినట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news