నా ఫ్రెండ్స్ తో ఈత కొడితే సీఎం జగన్ కు ఎందుకు బాధ.. అయినా స్విమ్మింగ్ ఫూల్ లో ఈత కొట్టకుండా జాగింగ్ చేస్తారా అంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. నేతన్నకు చేయూత కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున నెల్లూరు జిల్లా వెంకటగిరి సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. యువగళం పాదయాత్రలో భాగంగా పొదిలిలో ఏర్పాటు చేసిన సభలో లోకేశ్ మాట్లాడారు.
‘‘నా స్నేహితులతో ఈత కొడితే సీఎం జగన్‌కు ఎందుకంత బాధ? స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టకుండా జాగింగ్ చేస్తారా? వాట్సప్ నంబర్ పంపు.. స్మిమ్మింగ్ వీడియోలు కావాలంటే పంపిస్తా. జగన్ గురించి ఆయన చెల్లెలు షర్మిల అంతా చెప్పింది. రాష్ట్రంలోనే అతిపెద్ద కుంభకోణం మార్కాపురంలో జరిగింది. చోటా నయీం గ్యాంగ్.. రూ.800 కోట్లు విలువైన భూములను స్వాహా చేశారు. బినామీల పేరుతో 378 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేశారు. తెదేపా అధికారంలోకి వచ్చాక సిట్ ఏర్పాటు చేసి కబ్జాకు గురైన భూములను వెనక్కి తీసుకొని పేదలకు పంచిపెడతాం’’ అని లోకేశ్ వెల్లడించారు.