దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోంది అని విమర్శలు చేశారు నారా లోకేష్.ఇవాళ దిశ యాప్ పై నారా లోకేష్ స్పందించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోందని నారా లోకేష్ ఆరోపించారు. ‘మహిళలు వేసుకోవాల్సిన యాప్ ను పురుషుల మొబైల్ లో బలవంతంగా డౌన్లోడ్ చేయించడం అనుమానాలకు తావిస్తోంది. ఇదే విషయాన్ని ప్రశ్నించిన అనకాపల్లి జిల్లాకు చెందిన సయ్యద్ అలీముల్లాపై పోలీసులు గూండాల్లా దాడి చేయడం దారుణం. దేశ భద్రత కోసం ప్రాణాలను పణంగా పెట్టే సైనికుడు, ఏపీకి వస్తే ఆయన ప్రాణాలకు రక్షణ లేని దుస్థితి’ అని ట్వీట్ చేశారు.
జగనాసుర పాలనలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తెచ్చిన దిశా చట్టంకి దిక్కూ మొక్కూ లేదు. మహిళల భద్రతకు అంటూ సర్కారు తెచ్చిన దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోంది. మహిళలు వేసుకోవాల్సిన దిశ యాప్ పురుషుల మొబైల్ లో బలవంతంగా డౌన్లోడ్ చేయించడం అనుమానాలకి తావిస్తోందన్నారు. ఇదే విషయాన్ని ప్రశ్నించిన అనకాపల్లి జిల్లా రేగుపాలేనికి చెందిన సైనికుడు సయ్యద్ అలీముల్లాపై పోలీసులు గూండాల్లా దాడి చేయడం దారుణం. దేశ భద్రత కోసం తన ప్రాణాలను పణంగా పెట్టే సైనికుడు, ఏపీకి వస్తే ఆయన ప్రాణాలకు రక్షణ లేని దుస్థితి అని పేర్కొన్నారు.