ఏపీ సర్కార్ మరో షాక్ తగిలింది. జీఓ 1 ని రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో, రోడ్ల కూడళ్ళలో సభలు, సమావేశాలు పెట్టకూడదని జారీ చేస్తూ జీఓ విడుదల చేసింది ఏపీ సర్కార్. అయితే… ఈ జీఓని సవాలు చేస్తూ పిటిషన్ వేశాయి సీపీఐ, టీడీపీ, బీజేపీ, AISF. ఇక తాజాగా ఈ వివాదంపై విచారణ జరిపి జీఓ రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే.. ఈ ఇష్యూపై నారా లోకేష్ స్పందించారు. ఏ1 తెచ్చిన జీవో1ని హైకోర్టు కొట్టేసింది. ఫ్యాక్షన్ పాలనపై ప్రజాస్వామ్యం గెలిచింది. రాజారెడ్డి రాజ్యాంగం ఇక చెల్లదంటూ అంబేద్కర్ రాజ్యాంగం నిరూపించింది అంటూ ట్వీట్ చేశారు లోకేష్. అటు కొడుక్కి కారుంటే తల్లికి పెన్షన్ తీసేస్తావా తుగ్లక్?! అని ఫైర్ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి తుగ్లక్ పాలనలో ఈ తల్లి ఒక బాధితురాలు. ఈమె పేరు చిన్నక్క. నందికొట్కూరు నియోజకవర్గం తుమ్ములూరుకు చెందిన ఈమెకు 10నెలల క్రితం పెన్షన్ తీసేశారని ఆగ్రహించారు నారా లోకేష్.
ఏ1 తెచ్చిన జీవో1ని హైకోర్టు కొట్టేసింది. ఫ్యాక్షన్ పాలనపై ప్రజాస్వామ్యం గెలిచింది. రాజారెడ్డి రాజ్యాంగం ఇక చెల్లదంటూ అంబేద్కర్ రాజ్యాంగం నిరూపించింది.#ByeByeJaganIn2024 pic.twitter.com/Us3Guspp30
— Lokesh Nara (@naralokesh) May 12, 2023