జగన్ రెడ్డి ఎన్ని కుతంత్రాలు పన్నినా పాదయాత్ర ఆగదన్నారు నారా లోకేష్. యువగళం పాదయాత్ర 37వరోజు పీలేరు నియోజకవర్గం కలికిరి ఇందిరమ్మనగర్ నుంచి ఆరంభమైంది. పాదయాత్రకు ముందు ముస్లింలతో సమావేశమయ్యానని లోకేష్ తెలిపారు. టిడిపి యువనేత, సోదరుడు వంగవీటి రాధ కృష్ణ నాతోపాటు నడిచారని లోకేష్ వివరించారు.
గంధబోయినపల్లి, బీదవారిపల్లి, చింతపర్తిలో ప్రజలు ఘనస్వాగతం పలికారన్నారు. వందలాది మంది పోలీసులతో పాదయాత్రని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. టిడిపిలో చేరిన నేతలపై తప్పుడు కేసులు బనాయించారని ఫైర్ అయ్యారు. విద్యార్థులు పాదయాత్రకి రాకుండా కాలేజీ గేట్లకు తాళాలేయించారు. జగన్ రెడ్డి ఎన్ని కుతంత్రాలు పన్నినా పాదయాత్ర ఆగదు, యువగళం నిన్ను నిలదీస్తూనే ఉంటుందని జగన్ కు వార్నింగ్ ఇచ్చారు నారా లోకేష్.