జగన్ వేసుకునే చెప్పుల ధర లక్ష రూపాయలు అని చురకలు అంటించారు నారా లోకేష్. 102వరోజు నంద్యాల శివారు మూలమఠం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు నారా లోకేష్. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో అడుగడుగునా నారా లోకేష్‌కు అపూర్వస్వాగతం పలికారు.
కాలనీల్లో తాగునీరు, డ్రైనేజ్, రోడ్లు, ఇతర సమస్యలు సర్కారు కనీసం పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోయారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. జనం ముందు ఈ మధ్య జగన్ జబర్దస్త్ స్కిట్లు వేస్తున్నాడు. జగన్ పేదవాడంట-జగన్ ఒంటరి వాడంట. లక్ష కోట్ల ప్రజాధనం దోచేసి, వందల ఎకరాల్లో లెక్కకు మించిన ప్యాలెస్లు కట్టుకున్న జగన్ పేదవాడు ఎలా అవుతాడు? అని ఆగ్రహించారు. లక్ష రూపాయల చెప్పులు, తాగే నీరు లీటర్ వెయ్యి రూపాయలు, సొంత పేపరు, సొంత చానల్ ఉన్న జగన్ పేదవాడు ఎలా అయ్యాడు? అని నిప్పులు చెరిగారు.