ఓడిపోయే సీట్లను వైసీపీ బీసీలకు ఇస్తున్నారు – నారా లోకేష్‌

-

వైసీపీలో జరుగుతున్న సీట్ల కసరత్తుపై స్పందించారు లోకేష్. వచ్చే ఎన్నికల్లో ఓడిపోయే సీట్లను వైసీపీ బీసీలకు ఇస్తున్నారు….గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ ఉన్నా.. గుంటూరు వెస్ట్ లాంటి సీటును ఆ పార్టీ గెలవలేదని ఆగ్రహించారు. గుంటూరు వెస్ట్ సీటును బీసీ మంత్రి విడదల రజనీకి ఇచ్చారు….మంగళగిరిలో రెండు సార్లు రెడ్లకే టిక్కెట్ ఇచ్చారని మండిపడ్డారు.

CID rains questions on Nara Lokesh
nara lokesh on ycp seats

ఇప్పుడు మంగళగిరిలో ఓడిపోతున్నామని తెలిసే బీసీకి టిక్కెట్ ఇచ్చారని ఫైర్‌ అయ్యారు. కడప ఎంపీ బీసీలకు ఇవ్వమనండి.. పులివెందుల సీటు బీసీలకు ఇమ్మనండని డిమాండ్‌ చేశారు. కడప ఎంపీ తన బంధువే కదా ఆ సీటు ఎందుకివ్వరు..? వైసీపీలో సమన్వయకర్తలను మారుస్తున్నారని ఆగ్రహించారు.

మాకు 175 నియోజకవర్గాలకు గానూ 170 సెగ్మెంట్లకు ఇన్ఛార్జులున్నారు….ఓ నియోజకవర్గంలో చెత్త అయితే.. మరో నియోజకవర్గంలో బంగారం అవుతుందా..? అని ప్రశ్నించారు. చిలకలూరి పేటలో మంత్రి విడదల రజనీ చెత్త అని సీఎం జగన్ స్పష్టంగా చెప్పేశారు.చిలకలూరి పేటకు పనికి రాని విడదల రజనీ గుంటూరు వెస్టులో ఎలా పనికొస్తారు..? అని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news