మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటా: నారా లోకేశ్‌

-

మంగళగిరి నియోజకవర్గంలో ఈరోజు ఉదయం ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేశ్‌ రెండోరోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. డీఎస్సీ-2008, జీవో నెం.39 ప్రకారం ఎంటీఎస్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 2,193 మందిని క్రమబద్ధీకరించాలని ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ సక్రమంగా చెల్లించనందున తన పాలిటెక్నిక్ సర్టిఫికెట్లను నూజివీడు కళాశాల నుంచి ఇప్పించాలని జగదీశ్‌ అనే విద్యార్థి నారా లోకేశ్​కు తెలిపారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది సేవలను 62 ఏళ్ల వరకు కొనసాగించాలని సిబ్బంది కోరారు. నులకపేట ఎంపీయూపీ ఉర్దూ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యా బోధనకు అనుమతి ఇవ్వాలని పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఐదు నెలల తన మేనల్లుడికి వైద్యసాయం అందించాలని మంగళగిరికి చెందిన షేక్ నజీనా లోకేశ్​ను వేడుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news