చంద్రబాబు సీఎం అయ్యాకే ఊళ్లో అడుగుపెడ్తా.. 5 ఏళ్ల తర్వాత పుట్టింటికి మహిళ

-

ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాకే పుట్టింటికి వస్తానని ఐదేళ్ల క్రితం శపథం చేసిన ఓ మహిళ ఎట్టకేలకు సొంత ఊళ్లో అడుగుపెట్టింది. ఇటీవలే ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో ఆమె స్వగ్రామానికి వచ్చింది. ఐదేళ్ల తర్వాత ఊళ్లోకి అడుగుపెట్టిన ఆ మహిళకు కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు.

ఏం జరిగిందంటే? ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన కట్టా గోపయ్య, సౌభాగ్యమ్మ దంపతుల నాలుగో కుమార్తె విజయలక్ష్మి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడుకు చెందిన పెదనాటి నర్సింహారావుతో వివాహం జరిగింది. ఆమె తల్లిదండ్రులు చనిపోవడంతో ఐదేళ్ల క్రితం సొంత గ్రామంలో ఉంటున్న తోబుట్టువు వద్దకు వచ్చింది. ఆ సమయంలో తన తోబుట్టువు కుమారుడు తాళ్లూరి ప్రసాద్​తో ఆమెకు రాజకీయంగా భిన్నవాదనలు తలెత్తాయి. దీంతో ఆమె చంద్రబాబు అధికారంలోకి వస్తేనే మళ్లీ ఊళ్లోకి వస్తానని శపథం చేసి వెళ్లింది. అప్పటి నుంచి మొన్నటి వరకు పుట్టింట్లో ఎలాంటి కార్యక్రమాలు జరిగిన ఆమె హాజరు కాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news