ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లాలోని ఉరవకొండ మండలం లోని బుదగవి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. కాగ కారులో పెళ్లి కి వెళ్లి వస్తుండగా.. ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కాగ కొంత మంది కారులో బళ్లారిలో పెళ్లికి హాజరు అయ్యారు.
అయితే పెళ్లి ముగించుకుని అదే కారులో బళ్లారి నుంచి అనంతపురం జిల్లా వైపు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి అనంతపురంలో జరిగిన ఈ ఘోర ప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఈ రోడ్డు ప్రమాదం తనను చాలా బాధించిందన్నారు ప్రధాని మోడీ. ఈ ప్రమాదంలో మరణించిన వాళ్లలో ఒక్కొక్కరికి 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు నరేంద్ర మోడీ. బాధిత కుటుంబాలకు ఆదుకోవాలని.. వారికి ప్రభుత్వం అండగా నిలువాలని పేర్కొన్నారు.
Pained by the loss of lives due to a tragic accident in Ananthapuramu district, AP. Condolences to the bereaved families. An ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of the deceased: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 7, 2022
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో అనేకమంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షలు ఎక్స్ గ్రేషియా PMNRF నుండి చెల్లిస్తాం: ప్రధానమంత్రి @narendramodi
— PMO India (@PMOIndia) February 7, 2022