వెంకటగిరిని ఆనం పూర్తిగా కలుషితం చేశాడని మండిపడ్డారు వెంకటగిరి వై.వి.పి. సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి. ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి విషయం మొదటి నుంచి ఊహించిందేనని… మంత్రి పదవి రాలేదని ప్రభుత్వంపై విమర్శలు చేశాడని మండిపడ్డారు. గడచిన నాలుగు సంవత్సరాలలో వెంకటగిరిని కలుషితం చేశాడని నిప్పులు చెరిగారు.
ఎక్కడికక్కడ అవినీతి, అక్రమాలు చేశాడని ఫైర్ అయ్యారు. మంత్రివర్గ విస్తరణలోనైనా మంత్రి పదవి దక్కుతుందని ఎదురు చూశాడని… వైసిపిని బ్రష్టుపట్టించాలనే తెలుగుదేశంకు కొమ్ము కాశాడని ఆగ్రహించారు. నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధి పనులన్నీ ఆపాడని… ఆనం విషయం తెలుసుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనను ప్రక్కన పెట్టారని తెలిపారు.
వెంకటగిరి మున్సిపాలిటీ లోని జగనన్న కాలనీలో జరిగిన అవకతవకలను బయటపెడుతానని… రాజకీయ చరిత్ర అని చెప్పుకునే ఆనం కుటుంబం ఎంతమందిని ఎమ్మెల్యేలను, ఎంపిలను చేసిందని వివరించారు. ఆనం వెల్లడం వల్ల వై.సి.పి.కి ఏమీ నష్టం లేదని… మంత్రి పదవి ఇవ్వలేదని టిడిపిలోకి వెళ్లే ఆనంకు ఆ పార్టీలో మంత్రి పదవి ఇస్తారా ? అని ప్రశ్నించారు. అసలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు….2024 లో మరలా అధికారంలోకి రాబోయేది వైసిపి ప్రభుత్వమే అన్నారు వెంకటగిరి వై.వి.పి. సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి.