స్టార్ డైరెక్టర్‌కు పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ గట్టి షాకిచ్చింది. వెండితెరపై గ్రేట్ డైరెక్టర్‌గా బ్లాక్ బస్టర్ హిట్‌లని అందించిన ఆయనని తిరస్కరించింది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ సినిమా చేసి ఆరేళ్లవుతోంది. 2015 అక్టోబర్ 9న రుద్రమదేవి విడుదలైంది. అప్పటి నుంచి ఇంత వరకు గుణశేఖర్ నుంచి మరో సినిమా రాలేదు.
రానాతో పాన్ ఇండియా స్థాయికి మించి హాలీవుడ్ రేంజ్ మేకింగ్‌తో `హిరణ్య కశ్యిప` చిత్రాన్ని చేస్తారకని ప్రచారం జరిగింది. గుణశేఖర్ కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటించారు. గత నాలుగేళ్లుగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని డి. సురేష్‌బాబు ప్రకటించారు కూడా. వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళుతుందని గుణ శేఖర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే ఆలోగా నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్ చేయాలని ప్లాన్ చేశారు. స్టోరీ రెడీ చేశారు. అయితే అది నెట్‌ఫ్లక్స్‌కి నచ్చలేదట. దీంతో డైరెక్టర్‌ని రిజెక్ట్ చేశారట. ఇదిఏ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.