కాంగ్రెస్ నాయకులు ప్రియాంక గాంధీ వాద్రా, రాహుల్ గాంధీలను హత్రాస్ వెళ్లే మార్గంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వే వద్ద ఉత్తరప్రదేశ్ పోలీసులు గురువారం ఆపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెక్షన్ 144 ను ఉల్లంఘించినందుకు గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ , జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో సహా 203 మంది కాంగ్రెస్ నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
గ్రేటర్ నోయిడాలోని ఎకోటెక్ ఫారెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసారు. గౌతమ్ బుద్ నగర్ పోలీస్ కమిషనరేట్ తెలిపిన వివరాల ప్రకారం… రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అజయ్ సింగ్ అలియాస్ లల్లూ, దీపేంద్ర సింగ్ హుడా, పిఎల్ పునియా, సచిన్ పైలట్, గౌతమ్ బుద్ నగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ చౌదరి సహా మరికొంత మందిపై కేసులు నమోదు చేసారు. అంటువ్యాధి చట్టం మరియు నిషేధిత చట్టం ప్రకారం వారిపై కేసులు పెట్టారు.