జగన్ పై దాడి కేసు విచారణలో పోలీసులకు కొత్త ఇబ్బందులు !

-

విజయవాడ జరిగిన జగన్ పై రాళ్ళ దాడి కేసు విచారణలో పోలీసులకు ఇబ్బందులు వస్తున్నాయి. బస్సు యాత్ర రూట్ లో సీసీ టివి ఫుటేజ్ సేకరణ సవాలుగా మారినట్టు చెబుతున్నారు పోలీసులు. జగన్ బస్సు యాత్ర నేపథ్యంలో ఆ రూట్ లో రోడ్డుకు ఇరు వైపులా కలిపే వైర్లను ముందే కట్ చేశారు అధికారులు. సీసీ టీవీ వైర్లు, కేబుల్ వైర్లు, విద్యుత్ వైర్లు కట్ చేయటంతో ఇబ్బందిగా మారింది సీసీ టీవీ ఫుటేజ్.

Attack on CM Jagan Election Commission into the arena

నెట్, విద్యుత్ సరఫరా ఉంటేనే డీవీఆర్ ఆన్ లో ఉండి సీసీ టివి ఫుటేజ్ రికార్డ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. విద్యుత్ సరఫరా లేకపోవటం, వైర్లు కట్ అవటంతో కష్టంగా మారింది సీసీ టివి ఫుటేజ్. సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉన్న వీడియో ల ద్వారా ఆధారాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. విద్యుత్, నెట్, సీసీ టీవీ కెమెరాల వైర్ లను ఉదయం నుంచి పునరుద్ధరణ చేస్తోంది ఆయా విభాగాల సిబ్బంది.

Read more RELATED
Recommended to you

Latest news