దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనేదే మా నినాదం: నడ్డా

-

దిల్లీలో బీజేపీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ జయంతి రోజు సంకల్ప్‌ పత్ర విడుదల సంతోషదాయకం అని అన్నారు. సామాజిక న్యాయం కోసం అంబేడ్కర్‌ జీవితాంతం పోరాడారని.. అంబేడ్కర్‌ సూచించిన మార్గంలో తాము కూడా నడుస్తున్నామని తెలిపారు. బీజేపీ వచ్చాక మారుమూల గ్రామాలకూ పక్కా రోడ్లు వేశామని, ఇవాళ రోడ్డు లేని గ్రామం లేదని చెప్పవచ్చని తెలిపారు. గ్రామాలకూ ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించామన్న జేపీ నడ్డా.. 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తున్నామని వెల్లడించారు. పేదలకు బియ్యం, గోధుమలు, పప్పులు అందిస్తున్నామని పేర్కొన్నారు.

‘పేదల జీవితాల్లో మార్పు రావాలనేదే మా లక్ష్యం. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనేదే మా నినాదం. సామాజిక సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. ఆర్టికల్‌ 370ని రద్దు చేశాం. అయోధ్యలో రామ మందిర్‌ స్వప్నాన్ని సాకారం చేశాం. ట్రిపుల్ తలాక్‌ను తొలగించి ముస్లిం మహిళలకు మేలు చేకూర్చాం. మహిళల రిజర్వేషన్‌ చట్టాన్ని తీసుకువచ్చాం. కరోనాను పక్కా ప్రణాళికతో, ధైర్యంగా ఎదుర్కొన్నాం. కరోనాకు 9 నెలల్లోనే విజయవంతంగా వ్యాక్సిన్‌ తయారు చేశాం. కరోనా వ్యాక్సిన్‌ను వంద దేశాలకు ఎగుమతి చేశాం. ఆయుష్మాన్‌ భారత్ ద్వారా 50 కోట్ల మందికి మేలు చేకూర్చాం.’ అని నడ్డా అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news