విజయవాడ వరద బాధితులకు కొత్త టెన్షన్..

-

కృష్ణా బ్యారేజీకి భారీగా చేరుకున్న వరద కారణంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో నివాసముంటున్న బాదితులకు ఇందిరాగాంధీ స్టేడియంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వారు తమని చెత్త ఎత్తే మున్సిపాలిటీ వ్యాన్ లో తరలిస్తున్నారని, తమను అంత నీచంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు వారికి మరో టెన్షన్ పట్టుకుంది. అదేంటంటే ప్రకాశం బ్యారేజి వద్ద ఐదు రోజులుగా వరద ఉధృతి తగ్గడం లేదు. కొంతమందికి అధికారులు ఇందిరాగాంధీ స్టేడియం లో పునరావాసం కల్పించారు.

అయితే ఈరోజు సాయంత్రం అకస్మాత్తుగా పునరావాస శిబిరం ఖాళీ‌ చేయాలని పోలీసులు ఆదేశించారు. అయితే వరద తగ్గకుండా ఎలా వెళతామని బాధితులు ప్రశ్నించారు. దీంతో ఇరు‌వర్గాల మధ్య వాదనలు జరుగుతున్నాయి. మరో శిబిరం‌ చూపించాలని కోరినా అధికారులు సైలెంట్ అయిపోయారు. ఈనెల 21 పోలీసు అమరవీరుల దినోత్సవం కోసం ఖాళీ‌ చేయాలని‌ బెదిరిస్తున్నారని వరద బాధితులు అంటున్నారు. మా ఇళ్లు ఇంకా ముంపులోనే ఉన్నాయని‌ చెప్పినా వినకుండా‌ బెదిరిస్తున్నారని వారు అంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మాకు న్యాయం‌ చేయాలని వారు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news