ఈఎస్ఐ స్కాంలో కొత్త ట్విస్ట్… అచ్చెన్న చెప్పిందే నిజమా?

-

ఈఎస్ఐ స్కాం ఏపీలో ఒక సంచలనం అన్న సంగతి అందరికీ తెలిసిందే. అంతా ప్రశాంతంగా ఉన్నట్లు భావించిన టీడీపీలో ఉన్నపలంగా జగన్ సర్కార్ వేసిన పెద్ద బాంబ్! దీంతో అరెస్టయ్యింది అచ్చెన్నాయుడు అయినా కానీ… తెరవెనుక బాబుల హస్తం ఉందని కథనాలు వచ్చాయి.. వైకాపా నేతలు కూడా అలనే హింట్స్ ఇచ్చారు. ఆ సంగతి అలా ఉంటే… పోలీస్ విచారణలో భాగంగా అచ్చెన్న చెప్పిన ఒక మాట తాజాగా నిజమవుతుందనే ఊహాగాణాలు వెలువడుతున్నాయి.

పోలీసులు కస్టడీలో ఉన్న అచ్చెన్నను.. గుంటూరు జీజీహెచ్ లో విచారించిన సమయంలో అచ్చెన్న చెప్పిన ఒక మాట ఇప్పుడు నిజం కాబోతుంది. ఆ లెటర్ తాను ఇచ్చిన మాట వాస్తమే కానీ.. ఆ కనుగోళ్ల కు సంబందించిన వ్యవహారాళ్లోని కొన్ని జరిగే సమయంలో తాను కార్మికశాఖా మంత్రిగా లేరని! కాబట్టి… ఈ స్కాం లో పూర్తికాలం తానే మంత్రిగా లేను కాబట్టి.. నా ముందు, తర్వాత జరిగిన విషయాలకు తానెలా బాధ్యుడిని అవుతానని!

ఆ మాటలు బయటకు వచ్చినప్పటినుంచీ ఒక పేరు బలంగా వినిపించడం జరిగింది. అదే.. పితాని సత్యనరాయణ! ఈ స్కాంలో అచ్చెన్నా పాత్రతో పాటు పితాని సత్యనారాయణ పాత్ర కూడా ఉందని వార్తలు రావడం.. అనంతరం పితాని ప్రెస్ మీట్ పెట్టి మరీ.. తనకు ఎలాంటి సంబందం లేదని, తన కుమారుడి పేరు కూడా బయటకు వస్తుంది.. ఆయనకు కూడా ఎలాంటి సంబందం లేదు, ఎలాంటి విచారణకైనా తమ్ము సిద్ధమని తెలపడం తెలిసిందే. ఈ క్రమంలో పితాని కుమారుడు చేసిన ఒక పని సంచలనమైంది.

అయితే ఈ కుంభకోణానికి సంబంధించిన కేసులో తాజాగా మాజీ మంత్రి పిథాని సత్యనారాయణ కుమారుడు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇదే కేసుకు సంబంధించి పితాని కుమారుడు, అతని వ్యక్తిగత కార్యదర్శి మురళి మోహన్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇది కచ్చితంగా ఈఎస్ఐ కేసులో ఊహించని మలుపు అనేది విశ్లేషకుల మాట!

ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం మాజీ మంత్రి కుమారుడు దరఖాస్తు చేయడం ద్వారా ఈ కేసులో బుక్కైనట్టుగానే అంతా భావిస్తున్నారు.. ఇదే క్రమంలో ఇంత హడావిడిగా బెయిల్ కోసం పిటిషన్ వేశారంటే… ఏసీబీకి వీరి ప్రమేయంపై ఖచ్చితమైన ఆధారాలు లభించి ఉంటాయని.. ఆ సమాచారం పరోక్షం వీరికి చేరి ఉంటుందని అంటున్నారు! ఏది ఏమైనా.. ఈ లేటెస్ట్ అప్ డేట్ మాత్రం ఈ ఈఎస్ ఐ స్కాంలో కొత్త మలుపే!!

Read more RELATED
Recommended to you

Latest news