Notices issued to Anantapur YCP party office: వైసీపీ పార్టీకి మరో షాక్ తగిలింది. అక్రమ కట్టడమంటూ అనంతపురం వైయస్సార్ పార్టీ ఆఫీసుకు నోటీసులు జారీ అయ్యాయి. అక్రమ కట్టడాన్ని ఎందుకు కూల్చి వేయరాదో వివరణ ఇవ్వాలని అనంతపురం వైయస్సార్ పార్టీ ఆఫీసుకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ మేరకు డిప్యూటీ సిటీ ప్లానర్ హరి ప్రసాద్ పేరిట వ్తెఎస్సాఆర్సీపీ జిల్లా అధ్యక్షునికి నోటీసులు జారీ అయ్యాయి.

వైఎస్సార్సీపీ కార్యాలయాలు కూల్చేస్తామని అనంతరమే కాకుండా… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో సర్కారు నోటీసులు ఇష్యూ చేసింది చంద్రబాబు సర్కార్. అనుమతి లేకుండా నిర్మిస్తున్నారని బెదిరింపులకు పాల్పడుతోంది చంద్రబాబు సర్కార్. వీఎంఆర్డీఏ అనుమతులున్నప్పటికీ విశాఖ, అనకాపల్లిలో విడ్డూరంగా చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తోంది. జీవీఎంసీ ఇవ్వలేదంటూ వింతగా నోటీసులు జారీ చేసింది. నెల్లూరులో కూలదోస్తామని అధికారులు హడావుడి చేశారు. అటు ‘అనంత’లో ఆఫీస్ బాయ్ కి నోటీసు ఇచ్చి వెళ్లింది నగర పాలక సంస్థ సిబ్బంది. రాజమహేంద్రవరంలో పార్టీ కార్యాలయానికి నోటీసులు జారీ చేసింది చంద్రబాబు సర్కార్.