అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను పట్టుకున్న అటవీ శాఖ అధికారులు

-

సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే తాబేళ్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఈ సీజన్ లో చాలా ఎక్కువగా అక్రమంగా తాబేళ్లను తరలిస్తుంటారు. తాజాగా కాకినాడ నుండి ఏజెన్సీ మీదుగా ఒడిశాకు అక్రమంగా కారులో తరలిస్తున్న 246 తాబేళ్లను అల్లూరు జిల్లా తులసిపాక అటవీ చెక్ పోస్ట్ వద్ద అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఒడిశాకు  తాబేళ్లను తీసుకుని పోతున్నారనే సమాచారం మేరకు వీటిని స్వాధీనం చేసుకున్నామని అధికారులు  తెలిపారు.  కాకినాడ నుండి ఏజెన్సీ మీదుగా ఒడిశాకు అక్రమంగా కారులో తరలిస్తున్న 246 తాబేళ్లను అల్లూరు జిల్లా తులసిపాక అటవీ చెక్ పోస్ట్ వద్ద అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరు స్వాధీనం చేసుకున్న 246 తాబేళ్లలో దాదాపు 16 తాబేళ్ళు మృతి చెందాయి. ఇక మిగతా వాటిని శబరి నదిలో వదిలిపెడతామని చెప్పారు అధికారులు.  వీరు స్వాధీనం చేసుకున్న తాబేళ్ల  విలువ సుమారు  రెండున్నర లక్షల రూపాయల వరకు  ఉంటుంది అని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news